ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి | The development of the special reservation for STs | Sakshi
Sakshi News home page

ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి

May 16 2016 2:25 AM | Updated on Aug 20 2018 9:26 PM

ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి - Sakshi

ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలకు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు.....

రాయచూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలకు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. ఆదివారం ఆయన రాయచూరులో విలేకరులతో మాట్లాడారు. దళితులకు సమాన న్యాయం కోసం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బలిజ సమాజానికి అధికంగా స్థానాలు కేటాయించామన్నారు. మరోవైపు దళితులకు కేటాయించిన భూములు కూడా సక్రమంగా పంపిణీ కాకుండా ఉన్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టి పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి  పదవిని దళితులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సదాశివ కమిషన్ నివేదిక సిఫార్సులను త్వరితగతిన అమలు పర్చేందుకు సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించారని, వాటిని అమలు పర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement