పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య | tenth student commits suicide in suryapet district | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

May 3 2017 2:08 PM | Updated on Nov 6 2018 7:53 PM

మరి కొన్ని గంటల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు రానున్న నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

పెన్‌పహాడ్‌: మరి కొన్ని గంటల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు రానున్న నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మానస(15) పెన్‌పహాడ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది.
 
ఇటీవల జరిగిన పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో.. ఫెయిల్‌ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ మానసను చదివిస్తుండటంతో.. ఫెయిల్‌ అయితే తల్లిదండ్రులు బాధపడుతారనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement