సూర్యతో మరోసారి శ్రుతిహాసన్ | Suriya to romance Shruti Haasan again in Singam 3 | Sakshi
Sakshi News home page

సూర్యతో మరోసారి శ్రుతిహాసన్

May 15 2015 1:29 AM | Updated on Sep 3 2017 2:02 AM

సూర్యతో మరోసారి శ్రుతిహాసన్

సూర్యతో మరోసారి శ్రుతిహాసన్

దక్షిణాది ప్రముఖ హీరోయిన్లు తమిళ చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా? లేక కోలీవుడ్‌నే వారిపై ఆసక్తి చూపుతోందా?

 దక్షిణాది ప్రముఖ హీరోయిన్లు తమిళ చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా? లేక కోలీవుడ్‌నే వారిపై ఆసక్తి చూపుతోందా?అన్న అంశాన్ని పక్కన పెడితే ఇంతకుముందు తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్న బిగ్ బ్యూటీ తమిళంలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు. నటి సమంత, కాజల్ అగర్వాల్, నయనతార లాంటి వాళ్లు కోలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా క్రేజీ నటి శ్రుతిహాసన్ కూడా తమిళ చిత్రాలపైనే మక్కువ చూపిస్తున్నారనిపిస్తోంది. ప్రస్తుతం ఇళయదళపతితో పులి చిత్రంలో నటిస్తున్న శ్రుతి తాజాగా అజిత్‌కు జంటగా నూతన చిత్రంలో నటిస్తున్నారు.
 
 త్వరలో సూర్యతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. సూర్య నటించిన మాస్ చిత్రం ఈ నెల 29న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఆయన విక్రమన్ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న 24 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. తదుపరి నటించే చిత్రానికి కూడా కథ రెడీ అయ్యింది. సూర్య నటించిన సింగం, సీక్వెల్స్ ఘన విజయం సాధించాయి.
 
  ఈ రెండు చిత్రాలకు హరి దర్శకత్వం వహించారు. ఇప్పుడిదే కాంబినేషన్లో సింగం-3 సెట్‌పైకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సింగం, సింగం-2 చిత్రాల్లో నటించిన అనుష్కనే ఈ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. సింగం-2లో మరో హీరోయిన్‌గా హన్సిక నటించారు. అయితే సింగం-3లో అలాంటి కీలకపాత్రను నటి శ్రుతిహాసన్ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఇంతకుముందు హరి దర్శకత్వం వహించిన పూజై చిత్రంలోనే శృతి కోలీవుడ్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారన్న విషయం గమనార్హం. దీంతో హరి దర్శకత్వంలోను సూర్య సరసన రెండవసారి నటించడానికి శ్రుతిహాసన్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement