వైఎస్ఆర్ ముందుచూపుతోనే... | Sripada yellampalli project Foundation by ys rajasekhar reddy says by tpcc chief uttam kumar reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ ముందుచూపుతోనే...

Sep 28 2016 1:57 PM | Updated on Sep 19 2019 8:44 PM

వైఎస్ఆర్ ముందుచూపుతోనే... - Sakshi

వైఎస్ఆర్ ముందుచూపుతోనే...

వైఎస్ఆర్ ముందుచూపుతోనే శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ నేతలు చెప్పారు.

కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపుతోనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు బుధవారం సందర్శించారు.
 
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జీవన్రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో ప్రాజెక్టుల జలకళ కాంగ్రెస్ ఘనతేనన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తే కాంగ్రెస్కు పేరొస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టును ప్రారంభించినా...లేకపోయినా పంప్హౌస్లు పూర్తి చేసి 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement