పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని.. | Son of Delhi cop slits minor girls throat for asking him to marry her | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని..

Sep 24 2016 9:54 AM | Updated on Aug 21 2018 8:23 PM

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని.. - Sakshi

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని..

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన స్నేహితురాలిని ఓ యువకుడు కత్తితో ఆమె గొంతుకోశాడు.

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన స్నేహితురాలిని ఓ యువకుడు కత్తితో ఆమె గొంతుకోశాడు. ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు రాహుల్ కుమార్ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేసి 18 కుట్లు వేశారు.

రాహుల్ (24) ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. ఏడాదిన్నరగా రాహుల్, బాధితురాలు (17) స్నేహంగా ఉంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి రాహుల్ను ఒత్తిడి చేసింది. శుక్రవారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లిన రాహుల్ కూరగాయాలు కోసే కత్తిని తీసుకుని ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్లిక్ టాయ్లెట్లో దాక్కున్నాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

వివాహం చేసుకునేందుకు దుర్గా పూజ వరకు వేచిచూడమని స్నేహితురాలికి చెప్పానని, అప్పటికి ఆమెకు 18 ఏళ్లు వస్తాయని, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెబితే ఆమె వినలేదని రాహుల్ పోలీసుల విచారణలో వెల‍్లడించాడు. వెంటనే వివాహం చేసుకోవాలని, లేకుంటే రేప్ కేసు పెడతానని హెచ్చరించిందని రాహుల్ పోలీసుల విచారణలో చెప్పాడు. కాగా పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది. రాహుల్ ఆరోపణలను బాధితురాలి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, రాహుల్ గతంలో తమ అమ్మాయిని వేధించాడని చెప్పారు. నిందితుడు మరికొంతమంది అమ్మాయిలను వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement