
బీబీఎంపీకి షాక్ !
సకాలంలో రూ. 14 లక్షల బిల్లు చెల్లించకపోవడంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికె....
బెంగళూరు(బనశంకరి) : సకాలంలో రూ. 14 లక్షల బిల్లు చెల్లించకపోవడంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) కార్యాలయానికి విద్యుత్ సరఫరాను బెస్కాం అధికారులు బుధవారం నిలిపి వేశారు. దీంతో కంగు తిన్న పాలికె అధికారులు హుటాహుటిన రూ. 12 లక్షలు చెక్కు అందించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచి పోవడంతో కార్యాలయంలో కంప్యూటర్లు మొరాయించాయి. గతంలో కూడా ఇదే తరహాలు ఫోన్ బిల్లు చెల్లించకపోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు ఫోన్ కనెక్షన్‌ను కట్ చేసిన వైనం విదితమే.