వికారాబాద్‌ జిల్లాలో దారుణం | seven-year-old girl was allegedly raped by a 16-year-old | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ జిల్లాలో దారుణం

Feb 9 2017 11:46 AM | Updated on Sep 5 2017 3:18 AM

వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కోటాలగూడలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు చాక్లెట్‌ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అనంతరం బాధితురాలు తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో విషయం బయటకు తెలసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

girl raped, vikarabad, చిన్నారిపై అత్యాచారం, వికారాబాద్‌, 

Advertisement
 
Advertisement
Advertisement