స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ: పలువురు అరెస్ట్ | selfie with water bath girl | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ: పలువురు అరెస్ట్

Jun 12 2016 9:12 AM | Updated on Sep 4 2017 2:20 AM

స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ: పలువురు అరెస్ట్

స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ: పలువురు అరెస్ట్

కొడెకైనాల్‌లో జలపాతం వద్ద బాలికతో సెల్ఫీ తీసిన 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

12 మంది అరెస్ట్


తిరువొత్తియూరు: కొడెకైనాల్‌లో జలపాతం వద్ద బాలికతో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చికి చెందిన ఓ కుటుంబం శుక్రవారం కొడెకైనాల్‌కు పర్యటనకు వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన నాగర్‌కోవిల్‌కు చెందిన పర్యాటకులు బాలికతో తమ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న  ఆ బాలిక తల్లిదండ్రులపై వారు దాడి చేసినట్లు సమాచారం.

 ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిపై సమాచారం అందుకున్న కొడెకైనాల్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలికలో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement