సమంత సంచలన వ్యాఖ్యలు | Samantha Sensational Comments on South Indian movie industry | Sakshi
Sakshi News home page

సమంత సంచలన వ్యాఖ్యలు

May 19 2015 3:37 AM | Updated on Sep 3 2017 2:17 AM

సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత సంచలన వ్యాఖ్యలు

దక్షిణాది చిత్రపరిశ్రమతో దుస్తుల విషయంలో అంత అభిరుచి లేదన్న నటి సమంత వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

దక్షిణాది చిత్రపరిశ్రమతో దుస్తుల విషయంలో అంత అభిరుచి లేదన్న నటి సమంత వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ అమ్మడికి కొత్తేమీకాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలతో వివాదాల్లో ఇరుక్కున్నారు. కాగా ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత టిప్‌టాప్‌గా తయారయ్యి వచ్చారు. ముఖ్యంగా ఆమె దుస్తులు చూపరులను  ఆకర్షించాయి. ఇదే విషయాన్ని ఆమెతో అంటే అందుకు బదులిస్తూ డ్రస్ విషయంలో బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రపరిశ్రమలో అభిరుచి తక్కువేనన్నారు.
 
 అయితే ఈ విషయం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు అలాంటి అవసరం ఏర్పడిందన్నది తన భావన అన్నారు. తన వరకు కాస్ట్యూమ్స్ విషయంలో అధిక శ్రద్ధ చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఏదయినా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు రకరకాల దుస్తులు ధరిస్తానని అన్నారు. అవి ఇతరులను ఆకర్షిస్తున్నప్పుడు తనకూ సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు దక్షిణాది తారలు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారని సమంత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement