బ్రహ్మోత్సవాలపై ఉన్నతస్థాయి సమావేశం | salakatla brahmotsavam in tirumala on october 3 | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలపై ఉన్నతస్థాయి సమావేశం

Sep 16 2016 3:35 PM | Updated on Sep 4 2017 1:45 PM

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు.

తిరుమల: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సిద్ధార్థ సింగ్, ఎస్పీ విజయలక్ష్మీ, ఆలయ ఈవో, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 3 నుంచి 11 వరకు స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 2న అంకురార్పణ,  3న ధ్వజారోహణం, 7న గరుడసేవ, 8న స్వర్ణ రథం, 10న రథోత్సవం, 11న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.  
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న కోయల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతుందని ఈవో సాంబశివరావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement