తమిళనాడులో మరో బస్సు ప్రమాదం | road accident in kadalur at tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మరో బస్సు ప్రమాదం

Jul 15 2017 2:10 PM | Updated on Aug 30 2018 4:10 PM

తమిళనాడులో మరో బస్సు ప్రమాదం జరిగింది.

కడలూరు: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు- సిమెంట్‌ లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ​తిరుచ్చి-చెన్నై రాష్ట్ర రహదారిపై ఈ సంఘటన జరిగింది. బస్సు తిరుచిరాపల్లి నుంచి చెన్నైకి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
 
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు డ్రైవర్‌ దాటించేందుకు ప్రయత్నించినపుడు లారీని ఢీకొంది. గాయపడిన వారిని పెరాంబలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement