రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో | rajini fans fire on hero sharth kumar | Sakshi
Sakshi News home page

రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో

Jan 15 2017 9:53 PM | Updated on Sep 17 2018 5:18 PM

రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో - Sakshi

రజనీ రాజకీయాల్లోకొస్తే ఎదిరిస్తా: హీరో

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యాలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

చెన్నై : తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమిళనాడు సీఎం జయలలిత మరణంతో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్ కుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

శరత్ కుమార్కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. వేలూరులో శరత్ కుమార్ దిష్టి బొమ్మలను రజనీ అభిమానులు దగ్ధం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement