దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారి పీవీ నరసింహారావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావుకు సొంతపార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే ఎన్డీయే ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కనుంది. దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారి పీవీ నరసింహారావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 28న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా స్మారక స్థూపాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరిస్తారు.