పీఆర్వో శంకర్ గణేష్ కన్నుమూత | PRO Shankar Ganesh NO MORE | Sakshi
Sakshi News home page

పీఆర్వో శంకర్ గణేష్ కన్నుమూత

Jan 13 2015 2:30 AM | Updated on Sep 2 2017 7:36 PM

పీఆర్వో శంకర్ గణేష్ కన్నుమూత

పీఆర్వో శంకర్ గణేష్ కన్నుమూత

సీనియర్ పీఆర్వో శంకర్ గణేష్ (77) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సినీ రంగంలో పలు విభాగాల్లో అనుభవం గడించారు.

సీనియర్ పీఆర్వో శంకర్ గణేష్ (77) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సినీ రంగంలో పలు విభాగాల్లో అనుభవం గడించారు. తిరునెల్వేలికి చెందిన శంకర్ గణేష్ చెన్నైకి వచ్చిన తొలి రోజుల్లో వీనస్ మూవీస్ రత్నం వద్ద పని చేశారు. ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్‌గా తేన్‌మళై చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈయన నిశ్చల ఛాయాగ్రాహకుడిగా సందేశమిత్రన్ అనే పత్రిక లో పని చేశారు. ఆ తరువాత సినీ పీఆర్వోగా పని చేశారు. అదే విధంగా కొంతకాలం దివంగత మాజీ మంత్రి మురసోలిమారన్‌వద్ద కొంతకాలం సహాయకుడిగా పని చేశారు. సిల్క్‌కు సినిమా అనే పత్రికను ఆరేళ్లు నడిపారు. అనంతరం సినీ పీఆర్వో సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. శంకర్ గణేష్ నాలుగేళ్లపాటు ప్రముఖ దినపత్రిక ఁసాక్షిరూ.లో పని చేశారు. ఈయన భార్య కొద్దికాలం క్రితమే కాలంచేశారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో స్థానిక రాయపేటలోని ఆస్పత్రిలో చికిత్స పొందిన శంకర్‌గణేష్ ఆదివారం కన్నుమూశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement