
విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ అయ్యాడు. తన పెంపుడు శునకం గూగుల్ చనిపోవడంతో బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇక వీడ్కోలు అని రాసుకొచ్చాడు.
(ఇదీ చదవండి: వివాదంలో సుమ కొడుకు సినిమా.. నటుడు సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్)
'మా ప్రియమైన గూగుల్. గత 12 ఏళ్లుగా మా జీవితాల్లో నువ్వు భాగమయ్యావు. ఎంతో ప్రేమని పంచావు. అందమైన జ్ఞాపకాలని ఇచ్చావు. నువ్వే మా సన్‌షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని శూన్యత మాటల్లో వర్ణించలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్' అని వెంకటేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దీనికి నటి ఖుష్బూ కూడా కామెంట్ చేసింది. ఓం శాంతి అని రాసుకొచ్చింది.
వెంకటేశ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్‌గానే త్రివిక్రమ్‌తో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది కూడా కుటుంబ కథా చిత్రం అని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్‌ప్రైజ్)