
మరో బిగ్‌బాస్ జంట పెళ్లి చేసుకుంది. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన.. బిగ్‌బాస్ 7వ తమిళ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. అంతకు ముందు ఈమె.. తమిళ హిట్ సీరియల్ 'రాజా రాణి 2'తో ఆకట్టుకుంది. ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తనకు నిశ్చితార్థం అయిపోయినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
(ఇదీ చదవండి: పెళ్లి గురించి శుభవార్త చెప్పిన నారా రోహిత్)
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అర్చన రవిచంద్రన్.. నటుడు అరుణ్ ప్రశాత్‌తో ప్రేమలో పడింది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని మరోసారి బయటపెట్టారు. అప్పటినుంచి వీళ్ల పెళ్లి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పకనే చెప్పారు.

అర్చన.. బిగ్‌బాస్ 7వ సీజన్ లో పాల్గొని విజేతగా నిలవగా, అరుణ్ ప్రశాత్ గతేడాది జరిగిన 8వ సీజన్ లో కంటెస్టెంట్‌గా వచ్చాడు. విజేత కాలేకపోయాడు. గత సీజన్‌లోనే ప్రియుడు కోసం అర్చన కూడా కాసేపు అలా వచ్చి వెళ్లింది. ప్రస్తుతానికి తమకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం బయటపెట్టడంతో సహ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లి తేదీ తదితర వివరాలు చెబుతారేమో!
(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)