అతిథి పాత్రలో ప్రియా ఆనంద్ | Priya Anand bags role in 'Trisha Illana Nayantara' | Sakshi
Sakshi News home page

అతిథి పాత్రలో ప్రియా ఆనంద్

Jun 1 2015 4:55 AM | Updated on Sep 3 2017 3:01 AM

అతిథి పాత్రలో ప్రియా ఆనంద్

అతిథి పాత్రలో ప్రియా ఆనంద్

ప్రముఖతారలు ఇతర హీరోయిన్ల చిత్రాల్లో అతిథిగా మెరవడం కొత్తేమి కాదు. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ

ప్రముఖతారలు ఇతర హీరోయిన్ల చిత్రాల్లో అతిథిగా మెరవడం కొత్తేమి కాదు. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ లేక, ఓ ప్రత్యేక పాటలోనూ మెరుస్తూ ఉంటారు. అందుకు వారికి పారితోషికం కూడా ఘనంగానే ముట్టుతుంది. అలా నటి ప్రియా ఆనంద్ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతుంది. ప్రియా ఆనంద్‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. గౌతమ్ కార్తీక్‌తో నటించిన వై రాజా వై ఇటీవల విడుదలైంది. అయితే ఈ చిత్రం ఓకే అనిపించుకున్నా ప్రియా ఆనంద్‌కు మాత్రం పెద్దగా పేరు రాలేదు.
 
 దీంతో ప్రస్తుతం కొత్తగా అవకాశాల్లేవు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోకుండా వచ్చిన అతిథి పాత్రను ప్రియ ఒప్పేసుకుందట. ఈ చిత్రంలో జీవీకే జంటగా నటి ఆనంది నటిస్తుంది. దీని గురించి దర్శకుడు ఆధిక్ తెలుపుతూ త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటి ప్రియా ఆనంద్ నటించడం అన్నది నిజమేనన్నారు. అయితే ఈ పాత్రను గెస్ట్ పాత్ర అనలేమని అన్నారు. అలాగే ఆమెకీ చిత్రంలో పాట కూడా ఉండదని చెప్పారు. అయితే నటించేది కొన్ని సన్నివేశాలైనా అవి చిత్రాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయని అన్నారు. ఈ పాత్ర గురించి ప్రియకు వివరించగా వెంటనే నటించడానికి రెడీ అందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement