ఆరుగురు నో చెప్పిన పాత్రలో పూర్ణ | Poorna difference role in Director Aditya movie | Sakshi
Sakshi News home page

ఆరుగురు నో చెప్పిన పాత్రలో పూర్ణ

Jul 18 2015 2:19 AM | Updated on Sep 3 2017 5:41 AM

ఆరుగురు నో చెప్పిన పాత్రలో పూర్ణ

ఆరుగురు నో చెప్పిన పాత్రలో పూర్ణ

ఆరుగురు హీరోయిన్లు నిరాకరించిన పాత్రలో నటి పూర్ణ నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజానికి ఈ భామ తమిళంలో నటించి చాలా కాలమైంది.

 ఆరుగురు హీరోయిన్లు నిరాకరించిన పాత్రలో నటి పూర్ణ నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజానికి ఈ భామ తమిళంలో నటించి చాలా కాలమైంది. తెలుగులో అడపాదడపా నటిస్తున్న పూర్ణకు కోలీవుడ్ నుంచి కాల్ వచ్చింది. మిష్కిన్‌లాంటి కొందరి దర్శకుల చిత్రాల్లో హీరోయిన్లకు నటనకు అవకాశం ఉంటుంది. పిశాచు చిత్రంలో నటి ప్రయోగ ఒక సన్నివేశంలో నటించినా ఆ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా మిష్కిన్ కథ, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న  చిత్రం బుధవారం మొదలైంది. ఈ చిత్రానికి నవ దర్శకుడు ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
  ఈ చిత్రానికి హీరోయిన్ల అన్వేషణ సుదీర్ఘంగానే సాగిందంటున్నారు మిష్కిన్. ఆరుగురు హీరోయిన్లకు కథ చెప్పానన్నారు. వారిలో ఎవరు ఇందులో నటించడానికి ముందుకు రాలేదని అలాంటిది నటి పూర్ణ ధైర్యంగా నటించడానికి అంగీకరించిందని చెప్పారు. ఇది చాలెంజ్‌తో కూడిన పాత్ర అని అన్నారు. ఇందులో హీరోగా తానే నటించాలని మొదట భావించానని స్క్రిప్ట్ పూర్తి అయి న తరువాత దర్శకుడు రామ్ అయితే బాగుంటుందని ఆయన్ని హీరోగా ఎం పిక చేసినట్టు చెప్పారు. అయితే నెగి టివ్ పాత్రలో తాను నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సవర కత్తి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement