కేసీఆర్ సర్కార్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
సీడ్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కైంది
Apr 1 2017 2:07 PM | Updated on Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం జీవో 182 తో 40 శాతం విత్తనాల ధరలను పెంచడం దారుణం. సీడ్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కయింది. రైతులకు మద్దతు ధర పెంచరు.. కానీ సీడ్ ధరలు పెంచుతారా..? ప్రభుత్వం విత్తన చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టింది..? రైతులు పంటలు కాల్చుకుంటుంటే సర్కార్‌కు కనబడటం లేదా..? కేసీఆర్ చెప్పిన మార్కెట్ స్థిరీకరణ నిధి ఎటుపోయింది..? మంత్రులకు చీము నెత్తురుంటే తక్షణమే రైతులను ఆదుకోవాలి. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కి కనబడటం లేదా..? ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పక తగులుతుందని’’ అన్నారు.
Advertisement


