ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో వ్యభిచారం | Police bust sex racket, 22 arrested | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో వ్యభిచారం

Aug 20 2017 7:00 PM | Updated on Jul 23 2018 8:49 PM

ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో వ్యభిచారం - Sakshi

ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో వ్యభిచారం

ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో హైటెక్‌ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి 22 మందిని అరెస్టు చేశారు.

మండ్య(కర్ణాటక) : ఫ్యామిలీ రెస్టారెంట్‌ ముసుగులో హైటెక్‌ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి 22 మందిని అరెస్టు చేశారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నగువనహళ్లి గేట్‌ వద్ద మైసూరు, బెంగళూరు జాతీయ రహదారిలో మార్గా ఫ్యామిలీ రెస్టారెంట్‌ ఉంది. దీని కింద సొరంగం తరహాలో గుహ ఏర్పాటు చేసి కోల్‌కతా, ముంబై, బంగ్లాదేశ్‌కు చెందిన యువతులతో ఇక్కడ వేశ్యావాటిక నిర్వహిస్తున్నారు.

పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ జి.రాధిక నేతృత్వంలో పోలీసులు ఆదివారం ఆ హోటల్‌పై దాడి చేసి 22 మంది విటులను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన యువతులకు విముక్తి కల్పించారు. వీరి నుంచి ఐదు బైక్‌లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement