డీఐజీ విచారణలో పియూస్ మనూస్ | piyush manush Inquiry in DOG's office | Sakshi
Sakshi News home page

డీఐజీ విచారణలో పియూస్ మనూస్

Aug 13 2016 2:15 AM | Updated on Sep 29 2018 4:26 PM

డీఐజీ విచారణలో పియూస్ మనూస్ - Sakshi

డీఐజీ విచారణలో పియూస్ మనూస్

సేలంకు చెందిన సాంఘిక సేవా కార్యకర్త పియూస్ మనూస్. ఇతను సేలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

 వేలూరు: సేలంకు చెందిన సాంఘిక సేవా కార్యకర్త పియూస్ మనూస్. ఇతను సేలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల సేలం ముళ్లువాడి గేట్ వద్ద రైల్వేబ్రిడ్జి నిర్మాణ పనులను అడ్డుకొని నిలిపి వేసిన పియూస్ మనూస్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బ్రిడ్జి నిర్మించాలని పోరాటాలు చేశారు. బ్రిడ్జి నిర్మాణం కోసం స్థలం పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు కాబట్టి భూమిని మొత్తంగా స్వాధీనం చేసుకున్న అనంతరమే పనులను ప్రారంభించాలని కోరారు. దీంతో సేలం టౌన్ పోలీసులు పియూస్ మనూస్‌లతో పాటు పోరాటంలో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసి సేలం జైల్లో ఉంచారు.
 
 అనంతరం బెయిల్‌పై పియూస్ మనూస్‌ను విడుదల చేశారు. ప్రతిరోజూ సేలం కోర్టులో హాజరై సంతకాలు చేయాలని న్యాయమూర్తి నిబంధన విధించడంతో బెయిల్‌పై బయటకు వచ్చిన పియూస్ మనూస్ జైల్లో తనను జై లు సూపరింటెండెంట్ సెంథి ల్ కుమార్ అధ్యక్షతన 30 మంది పోలీసులు వెదురు కర్రలతో తనను కొట్టారని పుకార్లు సృష్టించాడు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, జైళ్ల  శాఖ ఏడీజీపీకి ఫిర్యాదు చేశారు.
 
 ఫిర్యాదును పొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వేలూరు రీజనల్ జైళ్ల శాఖ డీఐజీ ముహ్మద్ అనీఫ్ సేలంకు వెళ్లి పియూస్ మనూస్‌తో పాటు జైలు అధికారుల వద్ద విచారణ జరిపారు. మరోసారి విచారణ కోసం పియూస్ మనూస్‌తో పాటు భార్య మోనికా శుక్రవారం ఉదయం వేలూరులోని డీఐజీ కార్యాలయానికి వచ్చారు. పియూస్ మనూస్ వద్ద డీఐజీ ముహ్మద్ అనీఫ్ రెండు గంటల పాటు విచారణ జరిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement