పొరుగింటి అమ్మాయిననే ముద్ర తుడిపేస్తా | Parineeti Chopra: I Hope to Kill the 'Girl-Next-Door' Image | Sakshi
Sakshi News home page

పొరుగింటి అమ్మాయిననే ముద్ర తుడిపేస్తా

Sep 6 2014 10:31 PM | Updated on Sep 2 2017 12:58 PM

పొరుగింటి అమ్మాయిననే ముద్రను తుడిపేస్తానని నటి పరిణీతి చోప్రా పేర్కొంది. మూస సినిమాల్లో నటిస్తున్నాననే అపప్రధ తనపై ఉందని, ‘కిల్ దిల్’, ‘ దావత్-ఇ-ఇష్క్’

పొరుగింటి అమ్మాయిననే ముద్రను తుడిపేస్తానని నటి పరిణీతి చోప్రా పేర్కొంది. మూస సినిమాల్లో నటిస్తున్నాననే అపప్రధ తనపై ఉందని, ‘కిల్ దిల్’, ‘ దావత్-ఇ-ఇష్క్’ సినిమాలతో అది తొలగిపోతుందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనపై వవచ్చిన డేటింగ్ వదంతులను పరిణీతి కొట్టిపారేసింది. కిల్ దిల్ సినిమామ దర్శకుడు షాద్ అలీతో దర్శకత్వంలో పనిచేయడం ఎలాంటి అనుభూతి కలిగించిందని ప్రశ్నించగా ఎంతో సరదాగా ఉందంది. కొంత విస్మయం కూడా కలిగించిందంది. సెట్‌పై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ షాద్ సరదాగానే ఉంటాడంది.
 
 అతనితో ఎలాంటి ఇబ్బందులూ లేవంది. షాద్ కోపిష్టి కాదని, అద్భుతమైన దర్శకుడని, అంతేకాకుండా మంచి స్నేహితుడు కూడా అని చెప్పింది. షూటింగ్ అయిపోయాక తామంతా సరదాగా గడిపేవారమని, పార్టీలు కూడా చేసుకునేవారమని తెలిపింది. ఈ సినిమాలో తనతోపాటు నటిస్తున్న రణ్‌వీర్, షాద్‌లు మంచి స్నేహితులని అంది. బాలీవుడ్‌లోకి బయటి నుంచి వచ్చారా అని అడగ్గా అవునంది. రణ్‌వీర్‌తో తన మనోభావాలను పంచుకున్నానని, యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీసిన సినిమాల్లో నటించే సమయంలో అతనికి కెరీర్ గెడైన్స్ చేసేదానినని అంది.
 
 రణ్‌వీర్ తన సహనటుడని, అయితే దర్శకుడు షాద్ గురించి తనకు అంతగా తెలియదంది. రణ్‌వీర్‌తో మాట్లాడిన ఐదు నిమిషాల సమయంలోనే అతనిపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందంది. అయితే షాద్‌ను అర్ధం చేసుకోవడం అంత తేలిక కాదంది. షాద్ ఏ విషయాన్ని బాగా లోతుగా ఆలోచించడంది. బాగా జోక్‌లు వేస్తుంటాడంది. తాను నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడంది. మనీశ్ శర్మతో మీకు సంబంధాలు ఉన్నాయంటూ వదంతుల మాటేమిటని ప్రశ్నించగా అవన్నీ అబద్ధమని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement