breaking news
Kill Dill
-
పొరుగింటి అమ్మాయిననే ముద్ర తుడిపేస్తా
పొరుగింటి అమ్మాయిననే ముద్రను తుడిపేస్తానని నటి పరిణీతి చోప్రా పేర్కొంది. మూస సినిమాల్లో నటిస్తున్నాననే అపప్రధ తనపై ఉందని, ‘కిల్ దిల్’, ‘ దావత్-ఇ-ఇష్క్’ సినిమాలతో అది తొలగిపోతుందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనపై వవచ్చిన డేటింగ్ వదంతులను పరిణీతి కొట్టిపారేసింది. కిల్ దిల్ సినిమామ దర్శకుడు షాద్ అలీతో దర్శకత్వంలో పనిచేయడం ఎలాంటి అనుభూతి కలిగించిందని ప్రశ్నించగా ఎంతో సరదాగా ఉందంది. కొంత విస్మయం కూడా కలిగించిందంది. సెట్‌పై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ షాద్ సరదాగానే ఉంటాడంది. అతనితో ఎలాంటి ఇబ్బందులూ లేవంది. షాద్ కోపిష్టి కాదని, అద్భుతమైన దర్శకుడని, అంతేకాకుండా మంచి స్నేహితుడు కూడా అని చెప్పింది. షూటింగ్ అయిపోయాక తామంతా సరదాగా గడిపేవారమని, పార్టీలు కూడా చేసుకునేవారమని తెలిపింది. ఈ సినిమాలో తనతోపాటు నటిస్తున్న రణ్వీర్, షాద్లు మంచి స్నేహితులని అంది. బాలీవుడ్‌లోకి బయటి నుంచి వచ్చారా అని అడగ్గా అవునంది. రణ్వీర్తో తన మనోభావాలను పంచుకున్నానని, యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీసిన సినిమాల్లో నటించే సమయంలో అతనికి కెరీర్ గెడైన్స్ చేసేదానినని అంది. రణ్వీర్ తన సహనటుడని, అయితే దర్శకుడు షాద్ గురించి తనకు అంతగా తెలియదంది. రణ్వీర్తో మాట్లాడిన ఐదు నిమిషాల సమయంలోనే అతనిపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందంది. అయితే షాద్ను అర్ధం చేసుకోవడం అంత తేలిక కాదంది. షాద్ ఏ విషయాన్ని బాగా లోతుగా ఆలోచించడంది. బాగా జోక్‌లు వేస్తుంటాడంది. తాను నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడంది. మనీశ్ శర్మతో మీకు సంబంధాలు ఉన్నాయంటూ వదంతుల మాటేమిటని ప్రశ్నించగా అవన్నీ అబద్ధమని స్పష్టం చేసింది. -
కృతజ్ఞతతో ఉంటా!
సీనియర్ నటుడు గోవిందా అంటే రణ్‌వీర్‌సింగ్‌కు చెప్పలేనంత అభిమానం. కొన్ని కొన్ని సినిమాల్లో గోవిందా నటనను అనుకరించాడు కూడా. ఈ విషయమై గోవిందా మాట్లాడుతూ అటువంటి యువతరం కథానాయకులపట్ల తాను కృతజ్ఞతతో ఉంటానన్నాడు. తన నృత్యశైలిని అనుకరించడం ఎంతో ఆనందం కలిగిస్తుందన్నాడు. కాగా షాద్ అలీ రూపొందిస్తున్న ‘కిల్ దిల్’ సినిమాలో గోవిందాతో కలసి రణ్వీర్ స్టెప్పులు వేయనున్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘గోలియోంకీ రాస్లీలా రాంలీలా’ సినిమాలో గోవిందా తరహాలోనే రణ్వీర్ నృత్యం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలోనూ గోవిందా మాదిరిగానే నర్తించాడు. యువప్రతిభను ప్రశంసిస్తూ ‘అవును. రాంలీలా సినిమాలో ఇష్కియా డిష్కియా పాటకు రణ్వీర్ వేసిన స్టెప్పులు చూశా. ఎంతో బాగా చేశాడు. పూర్తిగా ఫాంలో ఉన్నాడు. నా శైలి విలువైనదని భావించి దానిని అనుకరించొచ్చని భావించేవారిపట్ల కృతజ్ఞతతో ఉంటా’ అని అన్నాడు. గోవిందా, రణ్వీర్ కాంబినేషన్లో షాద్అలీ త్వరలో ఓ సినిమా తీయనున్నాడు. దీంతో వీరిరువురి స్టెప్పులను అభిమానులు పోల్చిచూసుకునే అవకాశం లభిస్తుందని ‘కిల్ దిల్’ సినిమావర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంచితే గోవిందా ఇటీవల కొద్దిగా బరువు తగ్గాడు. కిల్ దిల్ సినిమాలో గోవిందా తొలిసారిగా ప్రతి నాయకుడి పాత్ర పోషించబోతున్నాడు. ‘ఇది నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో నటిస్తున్న ప్రతినాయకుడి పాత్ర. కొన్నేళ్ల క్రితం షికారి సినిమాలో విలన్ పాత్ర పోషించా. అయితే అది చిన పాత్ర మాత్రమే’ అని చెప్పాడు.