‘అమాయకులపై కేసులను ఉపసంహరించుకోవాలి’ | pallam raju speaks over kapu reservations | Sakshi
Sakshi News home page

‘అమాయకులపై కేసులను ఉపసంహరించుకోవాలి’

Sep 17 2016 4:46 PM | Updated on Sep 4 2017 1:53 PM

తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పల్లంరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గుంటూరు: తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

మంజునాథ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన సూచించారు. కాపు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ విషయంలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు పల్లంరాజు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement