ఎన్నికల సంఘం తీసుకున్న ప్రత్యేక చొరవతో నగరంలోని సెక్స్‌వర్కర్లు కూడా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటిదాకా వీరి పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం తో
ఓటుహక్కు వినియోగించుకోనున్న 15 వందల మంది సెక్స్‌వర్కర్లు
Nov 30 2013 11:15 PM | Updated on Sep 2 2017 1:08 AM
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తీసుకున్న ప్రత్యేక చొరవతో నగరంలోని సెక్స్‌వర్కర్లు కూడా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటిదాకా వీరి పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం తో అనామకులుగానే ఉన్నారు. తాజాగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు నమో దు ప్రక్రియ ను రెడ్‌లైట్ ఏరియాలో కూడా నిర్వహించడంతో దాదాపు 1,500 మంది సెక్స్‌వర్కర్లు తమ పేర్ల ను నమోదు చేసుకున్నారు. వీరంతా డిసెంబర్ 4న జరగనున్న విధానసభ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయనున్నారు. జీబీ రోడ్డులోని రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న నఫీసా(పేరు మార్చాం) ఈ విషయమై మాట్లాడుతూ... ‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో నాతో కలిసి దాదా పు 300 మంది ఓటరుగా వారి వారి పేర్లను నమోదు చేసుకున్నారు.
వీరంతా ఇప్పుడు ఓటు వేయనున్నారు. వారిలో నేనూ ఉన్నందుకు సం తోషంగా ఉంద’ని పేర్కొంది. ‘ఇలా వివిధ ప్రాం తాల్లో 1,500 మంది సెక్స్ వర్కర్ల పేర్లు ఓటరు జాబితాలోకెక్కాయి. వీరంతా తమకు ఓటరు గుర్తింపు కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా పరిశీలన జరపాల్సి ఉంద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 2003లో ఇలా 300 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా 2008లో 1,200 మంది నమోదు చేసుకున్నారు. ఈ సంవత్సరం దాదాపు 1,500 మంది ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతం లో నాలుగు గోడల మధ్యే ఉండడానికి ఇష్టపడే వీరు ఇప్పుడు గుర్తింపు కార్డు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే సరైన పత్రాలు చూపించడం వీలుకాకపోవడంతో వీరికి ఓటరు గుర్తింపు కార్డు అంత సులభంగా లభించడంలేదు. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని పలువురు సెక్స్ వర్కర్లు కోరుతున్నారు.
Advertisement
Advertisement