మళ్లీ ఆందోళన | On October 2, a statewide protests | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆందోళన

Sep 11 2013 6:15 AM | Updated on Sep 1 2017 10:37 PM

కూడంకులంలో నిర్మితమవుతున్న అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే.

చెన్నై, సాక్షి ప్రతినిధి: కూడంకులంలో నిర్మితమవుతున్న అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి ప్రజలు, జాలర్లు రెండేళ్లు ఉద్యమం నిర్వహించారు. మరోవైపు అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి లభించనుందని ఇటీవల ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ఎంఎంకే ఎమ్మెల్యే జవహరుల్లా సమక్షంలో ఉద్యమనేత ఆంటోనిజాన్ తదితరులు ఇడిందకరైలో మంగళవారం సమావేశమయ్యూరు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
 
 ఆందోళనలకు మళ్లీ శ్రీకారం చుట్టాలని నిర్ణరుుంచారు. ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రధాని మన్మో హన్‌సింగ్, కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి, కొందరు అణువిద్యుత్ అధికారులు మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. అణువిద్యుత్ ట్రయల్న్‌ల్రో అవాంతరాలు ఏర్పడ్డాయని, మరో పదిహేను రోజుల్లో మరలా ప్రారంభిస్తామని చెప్ప డం తమ ఆందోళనలకు బలం చేకూర్చినట్లేనని అన్నారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాలు అపాయమని తెలిసినందునే కర్ణాటక ప్రజలు తిప్పికొట్టగా తమిళనాడులో స్థాపించారని పేర్కొన్నారు. తమిళుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రధాని, నారాయణస్వామి, కొందరు అణు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించుకోవచ్చని జూలై 11న కోర్టు తీర్పు వెలువడిందన్నారు.
 
 అదే నెల 13వ తేదీన ట్రయల్న్ ్రప్రారంభించారని అన్నారు. సుమారు 30 లేదా 45 రోజుల్లో 400 మెగావాట్ల ఉత్పత్తి సాధిస్తామని ప్రకటించారన్నారు. ప్రస్తుతం అక్కడి వాల్వ్‌లో లోపాలు తలెత్తినందున పనులు తాత్కాలికంగా నిలిపివేశామని, మరో 15 రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని అణుకేంద్రం ప్రకటించిందని తెలిపారు. అణు వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఇదే విషయమై ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. దశలవారీగా నిరసన గళం వినిపిస్తామన్నారు.
 
 రాష్ట్రానికి అదనపు విద్యుత్
 అణు విద్యుత్ ఉత్పత్తిలో వంద మెగావాట్లను రాష్ట్రానికి అదనంగా కేటాయించాలని కేంద్రం మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంతో చేసుకున్న ఒప్పంద పత్రాలను చేరవేసింది. విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్ల నుంచి 1000 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి కానుంది. తొలివిడతలోని మొత్తం 1000 మెగావాట్లను తమిళనాడుకే కేటాయించాలని ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి గతంలో లేఖ రాశారు. అయితే 544.1 మెగావాట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా మరో వంద మెగావాట్ల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అలాగే కర్ణాటకకు 249.5, కేరళకు 150.2, పుదుచ్చేరికి 37.8 మెగావాట్లను అణువిద్యుత్ కేంద్రం నుంచి అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement