breaking news
Nuclear power plant project
-
టార్గెట్ ‘ఫోర్డో’
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఫోర్డో ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణుకేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫోర్డో అణుకేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రీఫ్యూజ్‌లు భద్రపర్చిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తున్నాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్ సైట్‌ను ధ్వంసం చేయాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం అమెరికానే. ఏమిటీ అణుకేంద్రం? అణు బాంబు తయారీపై ఇరాన్ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇరాన్లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్‌కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 80 నుంచి 90 మీటర్ల(262 నుంచి 295 అడుగుల) లోతున అణుకేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లో అందరికీ తెలిసింది. ఇరాన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కొంత సమాచారం బయటకు వచి్చంది. కానీ, 2002 నుంచే ఇక్కడ నిర్మాణాలు మొదలైనట్లు తెలిసింది. ఫోర్డోలో 2,700 సెంట్రీఫ్యూజ్‌లు ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రీఫ్యూజ్‌లు 2,700 ఉన్నట్లు ఐఏఈఏ ఇటీవల తెలియజేసింది. 3,000 సెంట్రీఫ్యూజ్‌లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధిచేశారు. దాన్ని 90 శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్–గ్రేడ్ యురేనియంగా మూడు వారాల్లో మార్చొచ్చు. 9 అణు బాంబులు తయారు చేయడానికి ఈమాత్రం యురేనియం చాలు. అణ్వస్త్ర రహిత దేశమైన ఇరాన్ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే 31న పేర్కొంది. అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం. ఫోర్డో అణుకేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు ఢోకా ఉండదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, అది ఇజ్రాయెల్ వల్ల సాధ్యమేనా? ప్రత్యామ్నాయ మార్గం ఇదే.. ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిరీ్వర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఏమిటంటే.. అణుకేంద్రం లోపలికి దారితీసే సొరంగాల ఎంట్రన్స్‌లను ధ్వంసం చేయడం. అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయొచ్చు. సొరంగాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది. ఏకైక అస్త్రం జీబీయూ–57 పెనిట్రేటర్ బాంబుఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దానికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇది అమెరికా వద్ద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటెర్ స్వయంగా చెప్పారు. సొంతంగా పనిపూర్తి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు కాబట్టి అమెరికాపై ఆధారపడక తప్పదు. అమెరికా వద్ద జీబీయూ–57 ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన బి–2 స్టెల్త్ బాంబర్ల ద్వారా జీబీయూ–57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్‌ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకేచోట వెన్వెంటనే కనీసం రెండు బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు వెళ్లి పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రిపీటెడ్ స్ట్రైక్స్ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ కల్నల్ సెడ్రిక్ లైటన్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్‌ట్రెండ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
షేక్ హసీనాపై రూ. 500 కోట్ల అవినీతి ఆరోపణలు
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా,విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ (anti-corruption commission) ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏసీసీ నివేదిక ప్రకారం.. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు. -
మళ్లీ ఆందోళన
చెన్నై, సాక్షి ప్రతినిధి: కూడంకులంలో నిర్మితమవుతున్న అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి ప్రజలు, జాలర్లు రెండేళ్లు ఉద్యమం నిర్వహించారు. మరోవైపు అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి లభించనుందని ఇటీవల ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ఎంఎంకే ఎమ్మెల్యే జవహరుల్లా సమక్షంలో ఉద్యమనేత ఆంటోనిజాన్ తదితరులు ఇడిందకరైలో మంగళవారం సమావేశమయ్యూరు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆందోళనలకు మళ్లీ శ్రీకారం చుట్టాలని నిర్ణరుుంచారు. ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రధాని మన్మో హన్‌సింగ్, కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి, కొందరు అణువిద్యుత్ అధికారులు మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. అణువిద్యుత్ ట్రయల్న్‌ల్రో అవాంతరాలు ఏర్పడ్డాయని, మరో పదిహేను రోజుల్లో మరలా ప్రారంభిస్తామని చెప్ప డం తమ ఆందోళనలకు బలం చేకూర్చినట్లేనని అన్నారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాలు అపాయమని తెలిసినందునే కర్ణాటక ప్రజలు తిప్పికొట్టగా తమిళనాడులో స్థాపించారని పేర్కొన్నారు. తమిళుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రధాని, నారాయణస్వామి, కొందరు అణు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించుకోవచ్చని జూలై 11న కోర్టు తీర్పు వెలువడిందన్నారు. అదే నెల 13వ తేదీన ట్రయల్న్ ్రప్రారంభించారని అన్నారు. సుమారు 30 లేదా 45 రోజుల్లో 400 మెగావాట్ల ఉత్పత్తి సాధిస్తామని ప్రకటించారన్నారు. ప్రస్తుతం అక్కడి వాల్వ్‌లో లోపాలు తలెత్తినందున పనులు తాత్కాలికంగా నిలిపివేశామని, మరో 15 రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని అణుకేంద్రం ప్రకటించిందని తెలిపారు. అణు వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఇదే విషయమై ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. దశలవారీగా నిరసన గళం వినిపిస్తామన్నారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్ అణు విద్యుత్ ఉత్పత్తిలో వంద మెగావాట్లను రాష్ట్రానికి అదనంగా కేటాయించాలని కేంద్రం మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంతో చేసుకున్న ఒప్పంద పత్రాలను చేరవేసింది. విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్ల నుంచి 1000 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి కానుంది. తొలివిడతలోని మొత్తం 1000 మెగావాట్లను తమిళనాడుకే కేటాయించాలని ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి గతంలో లేఖ రాశారు. అయితే 544.1 మెగావాట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా మరో వంద మెగావాట్ల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అలాగే కర్ణాటకకు 249.5, కేరళకు 150.2, పుదుచ్చేరికి 37.8 మెగావాట్లను అణువిద్యుత్ కేంద్రం నుంచి అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. -
మళ్లీ ఆందోళన
చెన్నై, సాక్షి ప్రతినిధి: కూడంకులంలో నిర్మితమవుతున్న అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి ప్రజలు, జాలర్లు రెండేళ్లు ఉద్యమం నిర్వహించారు. మరోవైపు అణు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి లభించనుందని ఇటీవల ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ఎంఎంకే ఎమ్మెల్యే జవహరుల్లా సమక్షంలో ఉద్యమనేత ఆంటోనిజాన్ తదితరులు ఇడిందకరైలో మంగళవారం సమావేశమయ్యూరు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆందోళనలకు మళ్లీ శ్రీకారం చుట్టాలని నిర్ణరుుంచారు. ఉద్యమకారులు మాట్లాడుతూ ప్రధాని మన్మో హన్‌సింగ్, కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి, కొందరు అణువిద్యుత్ అధికారులు మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. అణువిద్యుత్ ట్రయల్న్‌ల్రో అవాంతరాలు ఏర్పడ్డాయని, మరో పదిహేను రోజుల్లో మరలా ప్రారంభిస్తామని చెప్ప డం తమ ఆందోళనలకు బలం చేకూర్చినట్లేనని అన్నారు. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాలు అపాయమని తెలిసినందునే కర్ణాటక ప్రజలు తిప్పికొట్టగా తమిళనాడులో స్థాపించారని పేర్కొన్నారు. తమిళుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రధాని, నారాయణస్వామి, కొందరు అణు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించుకోవచ్చని జూలై 11న కోర్టు తీర్పు వెలువడిందన్నారు. అదే నెల 13వ తేదీన ట్రయల్న్ ్రప్రారంభించారని అన్నారు. సుమారు 30 లేదా 45 రోజుల్లో 400 మెగావాట్ల ఉత్పత్తి సాధిస్తామని ప్రకటించారన్నారు. ప్రస్తుతం అక్కడి వాల్వ్‌లో లోపాలు తలెత్తినందున పనులు తాత్కాలికంగా నిలిపివేశామని, మరో 15 రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని అణుకేంద్రం ప్రకటించిందని తెలిపారు. అణు వ్యతిరేక ఆందోళనలు చేపట్టిన ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఇదే విషయమై ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. దశలవారీగా నిరసన గళం వినిపిస్తామన్నారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్ అణు విద్యుత్ ఉత్పత్తిలో వంద మెగావాట్లను రాష్ట్రానికి అదనంగా కేటాయించాలని కేంద్రం మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంతో చేసుకున్న ఒప్పంద పత్రాలను చేరవేసింది. విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్ల నుంచి 1000 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి కానుంది. తొలివిడతలోని మొత్తం 1000 మెగావాట్లను తమిళనాడుకే కేటాయించాలని ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి గతంలో లేఖ రాశారు. అయితే 544.1 మెగావాట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా మరో వంద మెగావాట్ల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అలాగే కర్ణాటకకు 249.5, కేరళకు 150.2, పుదుచ్చేరికి 37.8 మెగావాట్లను అణువిద్యుత్ కేంద్రం నుంచి అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.