గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు | new movie shooting start | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు

Aug 9 2015 2:40 AM | Updated on Sep 3 2017 7:03 AM

గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు

గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు

చిత్ర షూటింగ్ పూర్తి అయితే గుమ్మడి కాయ కొట్టడం చిత్రపరిశ్రమలో ఒక సంప్రదా యం. ఈ మధ్య కొత్తగా కేక్ కట్ చేయడం కూ డా ఆనవాయితీ అయ్యింది.

 చిత్ర షూటింగ్ పూర్తి అయితే గుమ్మడి కాయ కొట్టడం చిత్రపరిశ్రమలో ఒక సంప్రదా యం. ఈ మధ్య కొత్తగా కేక్ కట్ చేయడం కూ డా ఆనవాయితీ అయ్యింది. అలా తూంగావ నం చిత్ర యూనిట్ షూటింగ్‌ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టి,కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. విశ్వనాయకుడు కమలహాసన్ హీరోగా నటిస్తూ, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం తూం గావనం. నటి త్రిష కథానాయికిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ ముఖ్యపా త్ర పోషిస్తున్నారు. నవ దర్శకుడు రా జేష్ ఎం సెల్వ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కమలహాసన్ స్క్రీన్‌ప్లే రాశారు.
 
 ఆయన ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన జిబ్రాన్ సంగీత బాణీలు కడుతున్న తూంగావనం చిత్ర షూటింగ్‌ను వడివడిగా పూర్తిచేయడం విశేషం. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనూ, మలి షె డ్యూల్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నూ నిర్వహించి పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. వైరము త్తు రాసిన పాటకు జిబ్రాన్ సంగీత బాణీ లు కట్టగా కమలహాసన్ పాడడంతో తూంగావనం చిత్రం షూటింగ్ పార్టు ముగిసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో నిమగ్నమైన చిత్ర యూనిట్ త్వరలో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement