పెళ్లైన నాలుగు రోజులకే..! | new bridegroom committed suicide | Sakshi
Sakshi News home page

పెళ్లైన నాలుగు రోజులకే..!

Jun 10 2017 10:14 AM | Updated on Nov 6 2018 8:08 PM

పెళ్లైన నాలుగు రోజులకే..! - Sakshi

పెళ్లైన నాలుగు రోజులకే..!

వివాహం జరిగిన నాలుగు రోజులకే ఏం కష్టమో ఏమో కానీ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.

తిరుత్తణి(చెన్నై): వివాహం జరిగిన నాలుగు రోజులకే ఏం కష్టమో ఏమో కానీ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరుత్తణి సమీపంలో చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని చెరుకునూర్‌  దళితవాడకు చెందిన భాస్కర్‌(27) ప్రయివేటు కర్మాగార సిబ్బంది. అరక్కోణం తాలూకా  కుండ్రత్తూరు దళితవాడకు చెందిన అతని బంధువు  పళణి కుమార్తె పద్మ(21) ప్లస్‌టూ వరకు చదువుకుని అదే ప్రాంతంలోని ప్రయివేటు కర్మాగారంలో పని చేసేది.  ఇరు కుటుంబీకుల నిర్ణయం మేరకు భాస్కర్, పద్మల వివాహం నాలుగు రోజుల కిందట కేజీ కండ్రిగలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది.  రెండు రోజులు తల్లిగారింట్లో ఉండి మొదటిసారిగా భర్త ఇంటి మెట్టు ఎక్కింది.

ఇంతలో ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి ఇంట్లో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కుటుంబీకులు గుర్తించి వెంటనే షోళింగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు ఆమెను పరీ క్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  నవ వధువు  ఆత్మహత్యకు సంబంధించి తిరుత్తణి ఆర్డీవో విమల్‌రాజ్‌ దర్యాప్తు ప్రారంభించారు. మృతికి సంబం ధించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. వివాహం జరిగిన నాలుగు రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్య సంఘటన శుభకార్యం జరిగిన కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement