మూడు కోట్లు ఇస్తేనే ఓకే | Nayanthara demands Rs 3 crores | Sakshi
Sakshi News home page

మూడు కోట్లు ఇస్తేనే ఓకే

Mar 20 2015 2:44 AM | Updated on Sep 2 2017 11:06 PM

మూడు కోట్లు ఇస్తేనే ఓకే

మూడు కోట్లు ఇస్తేనే ఓకే

నయనతారను చూస్తుంటే ఏ దేశమేగినా ఎందుకాలిడినా... పద్యం గుర్తుకు రాక తప్పదు. సంచలనాలకు కేంద్రబిందువు

 నయనతారను చూస్తుంటే ఏ దేశమేగినా ఎందుకాలిడినా... పద్యం గుర్తుకు రాక తప్పదు. సంచలనాలకు కేంద్రబిందువు ఈ కేరళకుట్టి. ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలు చర్చనీయాంశంగాను, వివాద స్పదంగాను ఉంటాయి. నటుడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ, బ్రేక్ అప్ లాంటి వివాదస్పద అంశాలు కాగా,  నటిగా రీఎంట్రీ అయ్యి నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం చర్చనీయాంశంమేగా. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం నయనతార పారితోషికం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
 
 ఈ ముద్దుగుమ్మ ఎంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారో తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు. ఒకటి కాదు, రెండు కాదు మూడు కోట్లు ఇస్తేనే ఓకే అంటున్నారట. విజయ్, సూర్య నుంచి విజయ్ సేతుపతి, ఆది వరకు ఆమెతో నటించేస్తున్నారిప్పుడు. ఎవరైతే నాకేంటి నేనడిగిన పారితోషికం ముట్టితే చాలన్న చందాన నయన నడుచుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్. అయితే కోలీవుడ్‌లో ఇంత పారితోషికం డిమాండ్         చేస్తున్న ఈ అమ్మడు స్వభాషా చిత్రాల్లో భిన్నంగా ప్రవర్తిస్తున్నారట. చాలా కాలం తరువాత మలయాళంలో మమ్ముట్టి సరసన భాస్కర్ ది రాస్కేల్ అనే చిత్రంలో నటించి, తక్కువ పారితోషికం పుచ్చుకున్నారట. ఇదిప్పుడు తమిళంలో రీమేక్ అవుతోంది. తమిళంలోను నయనే నటిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement