భారత హాకీ అధ్యక్షుడికి పుత్రశోకం | Narinder Batra's son Dhruv passes away | Sakshi
Sakshi News home page

భారత హాకీ అధ్యక్షుడికి పుత్రశోకం

Oct 30 2014 1:38 PM | Updated on Jul 31 2018 5:31 PM

భారత హాకీ అధ్యక్షుడు నరేందర్‌ బాత్రాకు పుత్రశోకం కల్గింది. బత్రా తనయుడు ధృవ్(27) అనారోగ్యంతో మృతి చెందాడు.

న్యూఢిల్లీ: భారత హాకీ అధ్యక్షుడు నరేందర్‌ బాత్రాకు పుత్రశోకం కల్గింది.  బత్రా తనయుడు ధృవ్(27) అనారోగ్యంతో మృతి చెందాడు. గత నాలుగు రోజుల క్రితం మొరాకో వెళ్లిన ధృవ్  ఉదర సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని శుక్రవారం భారత్ కు తరలించనున్నారు.

 

ఈ సందర్భంగా నరేందర్‌ బాత్రాకు ఢిల్లీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. 'యుక్త వయసులోని ధృవ్ కుటుంబానికి దూరం కావడం నిజంగా బాధాకరం. ఆ కుటుంబానికి తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలి' అని భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్పీ బన్సాల్ సంతాపం తెలిపారు.  కాగా శుక్రవారం ధృవ్ అంత్యక్రియల కార్యక్రమానికి  ఢిల్లీ క్రికెట్ సభ్యులు హాజరవుతారని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రవి జైన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement