హైకోర్టు ఆమోదం తెలిపినా కూడా ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత
Nov 15 2016 4:35 PM | Updated on Sep 4 2017 8:10 PM
హైకోర్టు ఆమోదం తెలిపినా కూడా ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన స్వగృహం నుంచి కోనసీమ ముఖద్వారమైన రావులపాలేనికి బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేశారు. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఆయన కాపు సత్యాగ్రహ పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే.
చిట్టచివరి నిమిషంలో.. మంగళవారం నాడు హైకోర్టు ఆయన యాత్రకు ఆమోదం తెలిపింది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఆ విషయాన్ని పోలీసులు చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కానీ పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాల గురించి పట్టించుకోకుండా.. తమపని తాము చేసుకెళ్లిపోతున్నారు. పాదయాత్రను విరమించుకోవాలని ముద్రగడ పద్మనాభాన్ని కోరిన పోలీసులు.. ఆయనను గృహనిర్బంధం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా యాత్రను వాయిదా వేసుకోవాలని ఆయనను కోరినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement