టీఆర్‌ఎస్‌ను వీడను: గుత్తా | MP Gutta sukhendar Reddy comments on TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను వీడను: గుత్తా

Jan 2 2017 2:33 AM | Updated on Aug 14 2018 10:54 AM

టీఆర్‌ఎస్‌ను వీడను: గుత్తా - Sakshi

టీఆర్‌ఎస్‌ను వీడను: గుత్తా

అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరానని, తాను మళ్లీ పార్టీ మారుతానని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

చందంపేట: అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరానని, తాను మళ్లీ పార్టీ మారుతానని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం కేసీఆర్‌ కంకణ బద్ధులై ఉన్నారన్నారు. డిండికి నీటిని విడుదల చేయాలని సీఎంను కోరడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుందని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement