జైల్లో ఖైదీ వద్ద సెల్‌ఫోన్ | Mobile phones in prison | Sakshi
Sakshi News home page

జైల్లో ఖైదీ వద్ద సెల్‌ఫోన్

Sep 2 2016 9:30 AM | Updated on Sep 4 2017 12:01 PM

పుళల్ జైలులో గస్తీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

తిరువొత్తియూరు : పుళల్ జైలులో గస్తీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఖైదీ వద్ద సెల్ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జైలు ఆవరణలో పడి ఉన్న పార్సిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సదరు పార్సిల్ను సిబ్బంది తెరచి చూశారు.

అందులో మూడు సెల్ఫోన్లు, చార్జర్లుతోపాటు సిమ్కార్డులు, గంజాయి ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి జైలులో ఎవరి కోసం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఫోన్ స్వాధీనం చేసుకున్న ఖైదీ విఘ్నేష్ను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement