మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు.
మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ ఆత్మహత్య
May 12 2017 3:35 PM | Updated on Sep 5 2017 11:00 AM
వర్ని: ఆర్థిక ఇబ్బందులతో మిషన్ కాకతీయ సబ్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర్ రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా చర్లోపల్లి గ్రామం. రెండు నెలల క్రితం నుంచి కోటగిరి మండలం పొతంగల్ ప్రాంతంలో మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నాం లాడ్జీకి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


