హరీశ్రావుకు దేవినేని ఉమా ఫోన్ | minister devineni uma phone call to harish rao over floods water | Sakshi
Sakshi News home page

హరీశ్రావుకు దేవినేని ఉమా ఫోన్

Sep 22 2016 1:09 PM | Updated on Aug 1 2018 3:49 PM

హరీశ్రావుకు దేవినేని ఉమా ఫోన్ - Sakshi

హరీశ్రావుకు దేవినేని ఉమా ఫోన్

పులిచింతల ప్రాజెక్టు వరద పరిస్థితులపై హరీశ్కు దేవినేని ఉమా ఫోన్ చేసి మాట్లాడారు.

విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు వరద పరిస్థితులపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు గురువారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. 
 
పులిచింతల ప్రాజెక్టు వద్ద గంట గంటకూ వరద పెరుగుతున్న దృష్ట్యా నల్లగొండ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని హరీశ్ను ఉమా కోరారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ను అప్రమత్తం చేస్తానని ఉమాకు ఆయన హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement