ఎంఐఎం, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట | mim corporators attacks on trs MLA | Sakshi
Sakshi News home page

ఎంఐఎం, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట

Sep 24 2016 12:03 PM | Updated on Sep 4 2017 2:48 PM

నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ బస్తీ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ఎంఐఎం కార్పోరేటర్లు అడ్డుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ బస్తీ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానిక ఎంఐఎం కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా.. నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అనుచరులు, ఎంఐఎం కార్పోరేటర్లు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement