విద్యార్థిని వేధించిన యువకుడు అరెస్టు | Man arrested for winking at student in hotel | Sakshi
Sakshi News home page

విద్యార్థిని వేధించిన యువకుడు అరెస్టు

Aug 3 2014 8:51 AM | Updated on Oct 9 2018 5:39 PM

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శివమెగ్గకు చెందిన విశ్వనాథ్ (22)ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. శుక్రవారం అర్థరాత్రి విశ్వనాథ్ స్నేహితులతో కలిసి ఎస్సీ రోడ్డులోని హోటల్కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ భోజనం చేస్తున్న 20 ఏళ్ల యువతితో సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు.

బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కామాంధుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారణ చేస్తున్నామని శనివారం ఉప్పరపేట పోలీసులు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement