జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్

జిందాల్‌లో ‘ఆగడు’ సినిమా షూటింగ్


సాక్షి, బళ్లారి : ప్రిన్స్ మహేష్‌బాబు ‘ఆగడు’ షూటింగ్ బళ్లారి జిల్లా తోరణగల్లులోని జిందాల్ స్టీల్ ప్లాంటులో ఐదు రోజుల నుంచి జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను మూడు నెలల క్రితం జిందాల్ స్టీల్ ప్లాంటులో తీసిన సంగతి తెలిసిందే. పాటలు, ఫైటింగ్‌లతోపాటు ఇతరత్రా వినోద సన్నివేశాల చిత్రీకరణ కోసం మహేష్‌బాబు వారం రోజుల నుంచి జిందాల్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఆదివారం ఉదయం కూడా మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం వైద్యులు పరీక్షించి జ్వరం వచ్చినట్లు తెలపడంతో షూటింగ్‌కు విరామం తీసుకున్నాడు. విపరీతమైన దుమ్మూ-ధూళితో కూడిన సన్నివేశం షూటింగ్‌లో పాల్గొనడంతో మహేష్‌బాబు కాస్త అనారోగ్యానికి గురైనట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మరో వారం రోజులు జిందాల్‌లోనే బస చేసి షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top