ఇంజనీరింగ్‌ విద్యార్థుల దారుణ హత్య | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థుల దారుణ హత్య

Published Tue, Apr 4 2017 9:56 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థుల దారుణ హత్య - Sakshi

ముంబై: మహారాష్ట్రలో దారుణం  జరిగింది. ఇద్దరు ఇంజనీరింగ్‌ ఫైనల్‌  విద్యార్థులను  గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కొట్టి చంపారు. లోనావాలా, ఐఎన్ఎస్ శివాజీ సమీపంలోని  కొండ మీద నగ్నంగా పడివున్న రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. సింగద్‌ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కంప్యూటర్ ఇంజనీరింగ్   చదువుతున్న మరో విద్యార్థినిగా వీరిని  గుర్తించారు. ఈ జంటల హత్య ఉదంతం  స్థానికంగా కలకలం రేపింది.

అహ్మద్‌నగర్‌ కు చెందిన విద్యార్థి( 22), పుణేకు చెందిన అతని  స్నేహితురాలు అనూహ్యంగా శవాలై తేలారు. చేతులను వెనక్కి  కట్టివేసి, తలపై పదునైన  ఆయుధంతో బలంగా  మోదడంతో చనిపోయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.  సంఘటనా  స్థలంలో బాధితుని బైక్‌తో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  వీటి ఆధారంగా  బాధితులను గుర్తించిన పోలీసులు  కేసు నమోదుచేసి విచారణ  చేపట్టారు.

మరోవైపు హత్యకు గరైన  యువతికి  ఇప్పటికే ఉద్యోగం వచ్చిందని  కోర్సు పూర్తయిన తర్వాత  జాబ్‌లో  చేరేందుకు యోచిస్తున్నట్లు కళాశాల అధికారులు చెప్పారు. అలాగే హాస్టల్‌ నుంచి  తన స్నేహితునితో కలసి బయటికి వెళుతున్నానని, ఆలస్యంగా వస్తానంటూ  సన్నిహితులతో చెప్పి వెళ్లిందని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement