మాధవన్ చివరి రౌండ్ | Madhavan final round | Sakshi
Sakshi News home page

మాధవన్ చివరి రౌండ్

Dec 18 2014 3:44 AM | Updated on Sep 2 2017 6:20 PM

మాధవన్ చివరి రౌండ్

మాధవన్ చివరి రౌండ్

నటుడు మాధవన్ తమిళ తెరపై కనిపించి చాలా కాలమైంది. ఆయన్ని మడ్డీ అని ప్రేమగా పిలుచుకునే అభిమానులకు ఇది నిరాశ పరిచే విషయమే.

నటుడు మాధవన్ తమిళ తెరపై కనిపించి చాలా కాలమైంది. ఆయన్ని మడ్డీ అని ప్రేమగా పిలుచుకునే అభిమానులకు ఇది నిరాశ పరిచే విషయమే. అయితే, అలాంటి అభిమానులను  ఉత్సాహ పరిచే విషయం ఏమిటంటే, మాధవన్ మళ్లీ తెరపైకి రానున్నారు. ఇరుది చుట్రు(చివరి రౌండ్) పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మణిరత్నం శిష్యురాలు సుధాకౌంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  చిత్రంలో మాధవన్ మాజీ బాక్సింగ్ శిక్షకుడిగా నటిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఆయన కసరత్తులు చేసి, తన శారీరక భాషను మార్చుకుని నటిస్తున్నారు.  మాధవన్‌కు బాలీవుడ్‌లోను మంచి పేరు ఉన్నందున, ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు. హిందీలో సాల కాడుస్ అనే పేరును నిర్ణయించారట. ఈ ద్విభాషా చిత్రం పస్ట్ లుక్‌ను ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.  చిత్రం టీజర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement