ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
పినపాక: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. పినపాక మండలం సీతంపేట సమీపంలో శనివారం సాయంత్రం వేగంగా వెళ్తున్న బైక్‌ను, సిమెంట్ లారీ ఢీకొనటంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.