
ప్రతి కుటుంబానికీ లైఫ్ సెల్
సుదీర్ఘ జీవన పయనంలో మనిషికి సంక్రమించే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ప్రతికుటుంబానికీ ‘లైఫ్‌సెల్’ విధానం అవసరమని ప్రముఖ బాలీవుడ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సుదీర్ఘ జీవన పయనంలో మనిషికి సంక్రమించే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ప్రతికుటుంబానికీ ‘లైఫ్‌సెల్’ విధానం అవసరమని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ అన్నారు. ‘లైఫ్‌సెల్’ స్టెమ్‌సెల్ బ్యాంక్ వారు లక్ష స్టెమ్ సేకరణను అధిగమించిన సందర్భంగా ఆదివారం చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ పాల్గొన్నారు. ముందుగా ఆమె లైఫ్‌సెల్ కిట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, స్టెమ్‌సెల్ వినియోగం వైద్యరంగంలోనేచారిత్రాత్మక పరిణామమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు దీని ప్రాధాన్యతను గుర్తించాలని ఆమె కోరారు.
అతి స్వల్పమైన ఖర్చుతో తరతరాల వారికి ఇదొక అద్భుతమైన బహుమతి అని అభివర్ణించారు. ఈ విధానం సామాజిక పరంగా దూసుకెళ్లాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ విధానం భారత దేశానికి పరిచయమైన పదేళ్లలోనే లక్ష స్టెమ్‌సెల్ సేకరణ సాధించడం లైఫ్‌సెల్ విషయంలో ఒక మైలురాయి వంటిదని అన్నారు. ఈ మైలురాయిని దాటే కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నో ఉత్పత్తులకు తాను ప్రచారం చేస్తున్నా ఎంతో ప్రజా ప్రయోజనకరమైన విధానానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంలో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నట్లు ఆమె చెప్పారు. లైఫ్‌సెల్ మరింత ముందుకు సాగాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. లైఫ్‌సెల్ ఎండీ, సీఈఓ మయూర్ అభయ మాట్లాడుతూ, బ్లడ్ క్యాన్సర్‌ను సైతం ఈ విధానంలో నివారించవచ్చని అన్నారు. లైఫ్‌సెల్ సీఎంవో రవిశంకర్ మాట్లాడుతూ, 2004లో ఈ విధానం భారత్‌లోకి ప్రవేశించగా లైఫ్‌సెల్ ద్వారా లక్ష స్టెమ్‌సెల్ సేకరణ జరగడం అపూర్వమని అన్నారు.
స్టెమ్ సెల్ అంటే...
ప్రసవ సమయంలో తల్లీ, బిడ్డను కలుపుతూ ఉండే బొడ్డు (స్టెమ్‌సెల్) సశాస్త్రీయ విధానంలో వేరుచేసి భద్రపరుస్తారు. అదే డీఎన్‌ఏ కలిగిన వ్యక్తులకు క్లిష్టతరమైన వ్యాధులు సంక్రమిస్తే ఈ బొడ్డును ప్రత్యేక విధానం ద్వారా వినియోగించి సులభతరంగా నివారిస్తారు. ఆ కుటుంబంలోని వారికే కాదు 25-40 శాతం ఇతరులను కూడా ఈ స్టెమ్ సెల్ ప్రాణాపాయం కలిగిన వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇలా సుమారు 80 రకాల వ్యాధులకు ఇది నివారిణిగా ఉపయోగపడుతుంది.