ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. మోడీ సునామీ సృష్టించడంతో దీని ప్రభావం శాసనసభ ఎన్నికలపైనా తప్పక ఉంటుం దని ఆ పార్టీ ధీమాగా ఉంది.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. మోడీ సునామీ సృష్టించడంతో దీని ప్రభావం శాసనసభ ఎన్నికలపైనా తప్పక ఉంటుం దని ఆ పార్టీ ధీమాగా ఉంది. అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీ ఆప్ ఎత్తుగడలను చిత్తు చేయడానికి ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. కేరికేచర్లు, కార్టూన్లు, జోకులు, చిన్నచిన్న కవితల రూపంలో వివిధ విషయాలపై ఆప్ నేతల చే ష్టలను జనం ముందుంచాలని భావిస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీయేనని గుర్తించిన బీజేపీ ఆ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేయడానికి వ్యూహరచన చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆప్ నేతలు, కార్యకర్తలు అనునిత్యం చేసే ప్రయత్నాలను ప్రజల ముందు ఎండగట్టాలనుకుంటోంది. గతంలో ఆప్ తీరుతెన్నులతోపాటు, పలు అంశాల విషయంలో వ్యవహారశైలిని ప్రజల ముందు ఎండగడితే ఆప్ ఓటుబ్యాంకును బలహీనపరచవచ్చని బీజేపీ యోచిస్తోంది. కేరికేచర్లు, కార్టూన్లు, జోకులు, చిన్నచిన్న కవితల రూపంలో వివిధ విషయాలపై ఆప్ నేతల చే ష్టలను జనం ముందుంచాలని భావిస్తోంది. సోషల్ మీడియాపై ఆప్‌కు గల పట్టును దృష్టిలో పెట్టుకుని ఈ మాధ్యమం ద్వారా ఆప్ నేతలు చేసే అసత్య ప్రచారం గుట్టు రట్టు చేయాలని కూడా ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేయనుంది.
ఆప్ నేత కేజ్రీవాల్ ఎన్నో వాగ్దానాలను నిలబెట్టుకోలేదనే విషయాన్ని ఆయన ద్వంద్వ ప్రమాణాల కామిక్ స్ట్రిప్స్ ద్వారా జనానికి తెలియజేయడానికి బీజేపీ యత్నించనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలైన తీరును కూడా కామిక్ స్ట్రిప్స్ ద్వారా అపహాస్యం చేయనుంది. కామిక్స్ ద్వారా అత్యంత తీవ్రమైన అంశాలను కూడా తేలికైన రీతిలో చెప్పవచ్చని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అనేక కీలక విషయాల్లో అరవింద్ నేతృత్వంలోని ఆప్...సామాన్యులను ఎలా పక్కదారిపట్టిస్తోందనే విషయాన్ని ఆసక్తికరంగా ఢిల్లీవాసులకు వివరించాలంటే కామిక్స్ ఒక్కటే సరైన మార్గమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ....షీలాపై 15 పేజీల కామిక్ ‘షీలాకే కార్‌నామే’ పేరిట విడుదల చేసింది.
15 ఏళ్ల పాలనలో షీలాదీక్షిత్ చేసిన అక్రమాలు, అవినీతిని ఈ కామిక్ ద్వారా బీజేపీ వివరించింది. ఇప్పుడు ఆప్‌పై అదే అస్త్రం ప్రయోగించాలని బీజేపీ యోచిస్తోంది. తరచూ కేజ్రీవాల్ ధర్నాలు, అర్ధంతరంగా ప్రభుత్వాన్ని వదిలి పారిపోవడం తదితరాలన్నింటినీ ప్రజల ముందుంచుతామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. షీలాపై చర్య విషయంలో కేజ్రీవాల్ మాటమార్చిన తీరును ప్రజల ముందుంచడంద్వారా ఆప్... కాంగ్రెస్‌తో కుమ్మక్కైందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని యోచిస్తోంది.