ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి | Kannada actor Dr Rajkumar birthday celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి

Apr 25 2016 3:27 AM | Updated on Apr 3 2019 9:01 PM

ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి - Sakshi

ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి

కన్నడ సినీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఆదివారం నగరంలోని గాంధీవనంలో ఘనంగా నిర్వహించారు.

కోలారు : కన్నడ సినీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఆదివారం నగరంలోని గాంధీవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నడ సేన అధ్యక్షుడు కళావిద విష్ణు మాట్లాడుతూ... రాజ్‌కుమార్ జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్నారు. కన్నడ భాష , సంస్కృతికి అనిరత సేవలు అందించిన డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండు చేశారు. నగరంలో కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంకు డాక్టర్ రాజ్‌కుమార్ పేరు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్‌కుమార్ అభిమానుల సంఘం గౌరవా ద్యక్షుడు ధన్‌రాజ్, పాత్రికేయుడు గణేష్, చేతన్‌బాబు, కోనా మంజునాథ్ తదితరులు ఉన్నారు.

 ముళబాగిలులో...
ముళబాగిలు : కన్నడ నటుడు డాక్టర్ రాజకుమార్ జయంతి వేడుకలను ఆదివారం జయ కర్ణాటక ఆధ్వర్యంలో పట్టణంలోని సంత మైదానంలో ఘనంగా నిర్వహించారు.అ భిమానులు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కసాప మాజీ కార్యదర్శి శంకర్ కేసరి మాట్లాడుతూ... డాక్టర్ రాజ్‌కుమార్ చిత్రాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జయక ర్ణాటక అధ్యక్షుడు నందకిశోర్, శక్తి ప్రసాద్, రాజు, శివప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో బెంగుళూరులో మరణించిన క సాప మాజీ అధ్యక్షుడు పుండలీక హాలంబి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement