ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే | Kabali hero Rajinikanth at Rm Veerappan's 90th Birthday Celebrations | Sakshi
Sakshi News home page

ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే

Sep 11 2015 2:46 AM | Updated on Sep 3 2017 9:08 AM

ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే

ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే

నేను ఒక్కసారి చెబితే నూరు సార్లు చెప్పినట్లు. ఇది కాలాంతరం నిలిచిపోయే డైలాగ్ ,ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు గుర్తుండిపోయే

నేను ఒక్కసారి చెబితే నూరు సార్లు చెప్పినట్లు. ఇది కాలాంతరం నిలిచిపోయే డైలాగ్ ,ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు గుర్తుండిపోయే డైలాగ్ అని చెప్పవచ్చు. 20 ఏళ్ల క్రితం బాషా చిత్రం లో రజనీకాంత్ చెప్పిన సంభాషణ అది. ఆ చిత్రాన్ని సీనియర్ నిర్మాత,మాజీ మంత్రి ఆర్‌వి. వీరప్పన్ నిర్మించిన చిత్రం బాషా. ఆయన పుట్టిన రోజు వేడుకను బుధవారం చెన్నైలో జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గోన్నారు. రజనీకాంత్ మాట్లాడు తూ ఆర్‌వి.వీరప్పన్ నిర్మించిన బాషా చిత్రంలో నేను నటించాను.ఆ చిత్ర 125 రోజు విజయోత్సవంలో పా ల్గొన్న నేను బాంబుల సంస్కృతి గురించి మాట్లాడాను.
 
 ఆ మరునాడే వీరప్పన్ మంత్రి పదవి పోయింది.నాకు చాలా బాధేసింది.ఈ విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పాను.అప్పుడాయన నవ్వుతూ ఇది కాల నిర్ణయం అంటూ సర్వ సాధారణంగా అన్నారు.వీరప్పన్ ఇప్ప టి వరకూ ఒక్క సారి కూడా ఆస్పత్రికి వెళ్లలేదని చెబుతున్నారు.అలా ఆస్పతికెళ్లొచ్చిన బాధ ఏమిటో నాకు తెలుసు.దయచేసి ఎవరూ ఆస్పత్రికి వెళ్ళే అవకాశం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.ముఖ్యంగా 50 ఏళ్లపై బడిన వాళ్లుఎక్సర్‌సైజ్ చేయండి అని సూపర్‌స్టార్ హితవు పలికారు.కాగా ప్రస్తుతం నేను కబాలి చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాను.ఈ చిత్రం బాషాను అధిగమిస్తుందా? అని అడుగుతున్నారు.ఆ విషయం నేను చెప్పలేను.అయితే ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే.అని రజనీ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement