'ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలి' | junior doctors dharna in GGH | Sakshi
Sakshi News home page

'ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలి'

Oct 26 2016 12:34 PM | Updated on Sep 4 2017 6:23 PM

గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు జీజీహెచ్‌లో సూపరిండెంట్ చాంబర్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు.

- జీజీహెచ్ లో డాక్టర్ల ధర్నా
 
గుంటూరు మెడికల్: గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు జీజీహెచ్‌లో సూపరిండెంట్ చాంబర్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ప్రొఫెసర్ వేధింపుల వల్లే పీజీ సెకండియర్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జూనియర్ డాక్టర్లను సముదాయిస్తున్నారు. కాగా గైనకాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చదువుతున్న సంధ్యారాణి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది. 

Advertisement
 
Advertisement
Advertisement