అజిత్, విజయ్‌ల మధ్య చిచ్చు | Interesting scenes in Ajith, Vijay movie | Sakshi
Sakshi News home page

అజిత్, విజయ్‌ల మధ్య చిచ్చు

Mar 16 2015 1:10 AM | Updated on Sep 2 2017 10:54 PM

అజిత్, విజయ్‌ల మధ్య చిచ్చు

అజిత్, విజయ్‌ల మధ్య చిచ్చు

నటుడు అజిత్, విజయ్‌ల మధ్య వృత్తిపరంగా పోటీ ఉన్న మాట నిజమే అయినా వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ మంచి స్నేహితులే.

నటుడు అజిత్, విజయ్‌ల మధ్య వృత్తిపరంగా పోటీ ఉన్న మాట నిజమే అయినా వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ మంచి స్నేహితులే. అయితే వీరి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ అంశాన్ని దర్శకుడు తన చిత్రంలో వాడుకున్నారు. సింధు సమవెళి, మృగం లాంటి చర్చనీయాంశ కథాచిత్రాలను తెరకెక్కించిన ఈయన కొంచెం గ్యాప్ తరువాత దర్శకత్వం వహించిన చిత్రం కంగారు. వి హౌస్ ప్రొడక్షన్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు అర్జున్ హీరోగాను, ఆయనకు చెల్లెలిగా శ్రీప్రియాంక ప్రేయసిగా వర్ష అశ్వత్ నటించారు.
 
 తంబిరామయ్య, కళాభవన్ మణి, గంజాకరుప్పు, దర్శకుడు ఆర్.సుందర్ రాజన్, జగన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని దర్శకుడు సామి చిత్రీకరించారు. దీని గురించి ఆయన తెలుపుతూ చిత్రంలో నటి శ్రీప్రియాంక అజిత్‌కు, నటి వర్ష అశ్వత్ విజయ్‌కు తీవ్ర అభిమానులన్నారు. వీరిద్దరూ నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అంటూ పోట్లాడుకుంటూ పెద్ద రణరంగమే సృష్టిస్తారని చివరికి శ్రీప్రియాంక అజిత్ అభిమానిని పెళ్లి చేసుకుంటుందని తెలిపారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని ఏప్రిల్‌లో చిత్రాన్ని 150 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement