అంబులెన్స్‌లో ప్రేమ వివాహం | In the ambulance love marriage | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లో ప్రేమ వివాహం

Jun 8 2016 1:42 AM | Updated on Sep 4 2017 1:55 AM

అంబులెన్స్‌లో ప్రేమ వివాహం

అంబులెన్స్‌లో ప్రేమ వివాహం

ప్రమాదాల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడే అంబులెన్స్ ఓ ప్రేమ వివాహానికి వేదికగా ...

బెంగళూరు(కర్ణాటక) : ప్రమాదాల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడే అంబులెన్స్ ఓ ప్రేమ వివాహానికి వేదికగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి. చిత్రదుర్గ జిల్లాకు చెందిన నేత్రావతి, గురుస్వామి కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. జూన్ 5న చిత్రదుర్గ కోటలో జరిగిన సామూహిక వివాహాల్లో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లి.. కోటను సందర్శిస్తుండగా నేత్రావతిప్రమాదవశాత్తు జారి పడింది. వెన్నుముకకు తీవ్ర గాయమైంది.


ఆమెను చికిత్స కోసం అంబులెన్స్‌లో చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ముందే అనుకున్న ముహూర్తానికే వివాహం చేసుకోవాలన్న ఆమె నిర్ణయానికి కట్టుబడి పెళ్లికుమారుడు గురుస్వామి అంబులెన్స్‌లోనే తాళి కట్టాడు. నేత్రావతి నిర్ణయానికి విలువనిచ్చిన గురుస్వామిని స్థానికులు అభినందించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement