ఆదర్శం | Ideal Wedding | Sakshi
Sakshi News home page

ఆదర్శం

Nov 20 2014 2:04 AM | Updated on Sep 2 2017 4:45 PM

ఆదర్శం

ఆదర్శం

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు ...

సామూహిక వివాహాల్లో  మంత్రి ఆంజనేయ కుమార్తె పెళ్లి
హాజరైన సీఎం, మంత్రులు, మఠాధీశులు

 
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు.    
 
చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement